Niharika: పెళ్లిలోనే పెళ్లి కొడుకుని లేపేసే గొడవ... 'ఆహా'లో 'మద్రాస్ కారన్'

Madras Kaaran Moie Update

  • తమిళంలో రూపొందిన 'మద్రాస్ కారన్'
  • షేన్ నిగమ్ సరసన మెరిసిన నిహారిక 
  • రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ 
  • గ్రామీణ నేపథ్యంలో సాగే రివెంజ్ స్టోరీ    


'ఆహా'లో ఇప్పడు ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో సినిమా రెడీ అవుతోంది. తమిళంలో నిర్మితమైన ఆ సినిమా పేరే 'మద్రాస్ కారన్'. షేన్ నిగమ్, నిహారిక, కలైయరసన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. జనవరి 10వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, సంక్రాంతి పోటీని తట్టుకుని యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

అలాంటి ఈ సినిమా రేపటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రకటన చేస్తూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. రివెంజ్ డ్రామా నేపథ్యంలోనే నడిచే కథ ఇది. వాలి మోహన్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి సెకండాఫ్ మైనస్ అయిందనే టాక్ వినిపించింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'ఆహా'కి వస్తోంది. 

కథ విషయానికి వస్తే, మీరా - సత్య ప్రేమించుకుంటారు. వాళ్ల పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతాయి. మగపెళ్లివారు తరలివస్తారు. ఆ ఊళ్లోని దురై సింగంతో పెళ్లి కొడుకు గొడవ పడతాడు. దాంతో ఊళ్లో వాళ్లంతా ఏకమైపోయి, పెళ్లి కొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులను చంపాలని నిర్ణయించుకుంటారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ. 

  • Loading...

More Telugu News