Kannappa: సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ‘కన్నప్ప’ సాంగ్ ‘శివా శివా శంకరా’

- మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప
- ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ చిత్రం
- ఏప్రిల 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘శివా శివా శంకరా’ అనే పాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ శివరాత్రికి అన్ని చోట్లా ఈ పాటే మార్మోగిపోయేలా ఉంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటను 80 మిలియన్ల (8 కోట్ల) మంది వీక్షించారు. ఇక ఇన్ స్టాగ్రాంలో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు.
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ పాట ఆకట్టుకుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ ట్రెండ్‌లో చేరి రీల్స్‌తో తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా మొత్తం శివ నామస్మరణే కనిపిస్తోంది. అంతటా శివా శివా శంకరా’ అనే పాటే వినిపిస్తోంది.
మహా శివరాత్రి సందర్భంగా ఈ పాట మరింతగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట అద్భుతమైన విజయం సాధించడం గురించి నటుడు-నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ... "శివా శివా శంకరా పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మేం చాలా సంతోషిస్తున్నాం. ప్రజలు దానిని స్వీకరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈ పాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి వస్తున్నందున ఈ పాట మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అర్థమవుతోంది" అని అన్నారు.
ఈ చిత్రంలో మంచు విష్ణు కన్నప్ప పాత్రను పోషిస్తుండగా... రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.