Madhavi Latha: హీరోయిన్ మాధవీలతపై కేసు నమోదు

Case filed on actress Madhavi Latha

  • జేసీ, మాధవీలత మధ్య ముదురుతున్న వివాదం
  • మాధవీలతపై తాడిపత్రి పోలీసులకు మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ ఫిర్యాదు
  • సెక్షన్ 353 కింద మాధవీలతపై కేసు నమోదు చేసిన పోలీసులు

సినీ నటి మాధవీలత, తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. మాధవీలత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జేసీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.  

తనను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకురాలు, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ... మాధవీలతపై తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఒకానొక సమయంలో మాధవీలతకు జేసీ క్షమాపణలు కూడా చెప్పారు. ఆవేశంలో తాను తప్పుగా మాట్లాడానని, తనను క్షమించాలని కోరారు. అయినప్పటికీ మాధవీలత తగ్గలేదు. ఈ క్రమంలోనే జేసీపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు మాధవీలతపై తాడిపత్రిలో కేసు నమోదయింది.

  • Loading...

More Telugu News