Aadi Pinisetty: అలాంటి వాళ్లను ఏమనాలి?: నటుడు ఆది పినిశెట్టి

Aadi Pinisetty Interview

  • తెలుగు .. తమిళ భాషల్లో బిజీగా ఆది పినిశెట్టి
  • ఈ నెల 28న విడుదలవుతున్న 'శబ్దం'
  • విడాకుల విషయంపై స్పందించిన హీరో 
  • పుకార్లను పట్టించుకోనని వెల్లడి  


ఆది పినిశెట్టి ఒక వైపున హీరోగా .. మరో వైపున విలన్ గా చేస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి వారసుడు అయినప్పటికీ, ఆ కార్డు వాడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'శబ్దం' సినిమా రూపొందింది. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆది పినిశెట్టి బిజీగా ఉన్నాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " ఒక వైపున హీరోగా చేస్తూనే .. మరో వైపున విలన్ పాత్రలు చేస్తున్నాను. అలా డిఫరెంట్ గా ఆడియన్స్ కి కనిపించడమే నాకు ఇష్టం కూడా. చాలామంది ఆర్టిస్టులతో కలిసి పనిచేశాను. వాళ్లందరితో సెట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. కాల్ చేసి ఇబ్బందిపెట్టే పనులు మాత్రం చేయను" అని అన్నాడు. 

" నేను .. నిక్కీ గల్రాని కొంతకాలం క్రితం వివాహం చేసుకున్నాము. మేము విడాకులు తీసుకుంటున్నట్టు ఆ మధ్య ఒక వార్త వచ్చింది. ఆ న్యూస్ చూసి నేను షాక్ అయ్యాను. అసలు సంబంధమే లేకుండా ఆ వీడియో చేసిన వాళ్లను ఏమనాలి? అలాంటి వాళ్లు క్రియేట్ చేసే గాలివార్తలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని అనిపించింది. తమని తామే గౌరవించుకోకుండా కొంతమంది బ్రతికేస్తూ ఉంటారు. అలాంటివాళ్ల పుకార్లను పట్టించుకోవలసిన అవసరం లేదని లైట్ తీసుకున్నాను" అని చెప్పాడు. 

Aadi Pinisetty
Actror
Ravi Raja Pinisetty
  • Loading...

More Telugu News