AP Minister Narayana: కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి ప్రయాగ్‌రాజ్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన

minister narayana visits prayagraj to study kumbh arrangements

  • 2027లో గోదావరి పుష్కరాలు 
  • ప్రయాగ్‌రాజ్ కుంభమేళా అథారిటీ కమాండ్ కంట్రోల్ రూం, స్నాన ఘాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
  • కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలపై అధ్యయనం

ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించింది. కుంభమేళా ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం ఈ పర్యటన చేపట్టింది. 2027లో ఏపీలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కుంభమేళాలో మంత్రులు, అధికారులు అధ్యయనం చేస్తున్నారు. 

ఈ క్రమంలో సోమవారం ప్రయాగరాజ్ చేరుకున్న మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరుల బృందం కుంభమేళా అధారిటీ ఆఫీసును సందర్శించింది. కుంభమేళా ఏర్పాట్లు, రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యల గురించి మంత్రి బృందానికి కుంభమేళా ఆఫీసర్ విజయ్ కిరణ్ ఆనంద్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కుంభమేళా అధారిటీ కమాండ్ కంట్రోల్ రూం, స్నాన ఘాట్ల వద్ద ఏర్పాట్లను అక్కడి అధికారులతో కలిసి మంత్రి బృందం పరిశీలించింది. 

More Telugu News