Shankar Naik: స్పాలో దొరికిన శంకర్‌నాయక్‌పై వైసీపీ వేటు

YCP expells its leader Shankar Naik

  • విజయవాడలోని ఓ స్పా సెంటర్‌లో దొరికిన శంకర్ నాయక్
  • పార్టీ నుంచి బహిష్కరించినట్టు ప్రకటించిన వైసీపీ కేంద్ర కార్యాలయం
  • వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని పోలీసులతో శంకర్ నాయక్ వాగ్వివాదం

‘స్పా’ ముసుగులో జరుగుతున్న వ్యభిచార కేంద్రంలో పోలీసులకు దొరికిన వైసీపీ నేత, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య సోమశంకర్ నాయక్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. విజయవాడలోని వెటర్నీ కాలనీలో ‘స్టూడియో 9స్పాప్’ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఇటీవల మాచవరం పోలీసులు దాడులు చేశారు. పోలీసుల దాడి గురించి తెలుసుకున్న శంకర్‌నాయక్ గదిలో మంచం కింద దాక్కున్నారు. గుర్తించిన పోలీసులు ఆయనను బయటకు లాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, తన వీడియోలు బయటకు రావడంతో పోలీసులతో శంకర్ నాయక్ వాగ్వివాదానికి దిగినట్టు తెలిసింది. వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని, తన భార్య ఆత్మహత్య చేసుకుంటానని అంటోందని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలు బయటకు రావడంతో ఉన్నతస్థాయి నుంచి ఒక్కసారిగా ప్లాట్‌ఫారానికి పడిపోయానని, ఉద్దేశపూర్వకంగానే తన వీడియోలు బయటకు విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

Shankar Naik
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News