Canada: కెనడా కీలక నిర్ణయం.. వేలాదిమంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం

Canada lets officials cancel study and work visas

  • ఇమిగ్రేషన్ నిబంధనల్లో పలుమార్పులు చేసిన కెనడా
  • జనవరి 31 నుంచి అమల్లోకి
  • సరిహద్దు అధికారులకు వీసాలు రద్దు చేసే అవకాశం
  • కెనడాలో 4.27 లక్షల మంది భారత విద్యార్థులు

కెనడా తన ఇమిగ్రేషన్ నిబంధనల్లో చేసిన కీలక మార్పులు వేలాదిమంది భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనున్నాయి. కెనడా తాజా ‘ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్’ జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం సరిహద్దు అధికారులకు ఎలక్ట్రిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏఎస్), తాత్కాలిక రెసిడెంట్ వీసా (టీఆర్‌వీఎస్) వంటి తాత్కాలిక రెసిడెంట్ డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం వచ్చింది.  

ఈ కొత్త నిబంధనలతో భారత్ సహా విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు, తాత్కాలిక రెసిడెంట్ విజిటర్లు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కువగా కెనడాను ఎంచుకుంటారు. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం కెనడాలో 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు.  

సవరించిన నిబంధనలు కెనడా ఇమిగ్రేషన్ బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు కల్పించాయి. వీరు ఈటీఏఎస్, టీఆర్‌వీఎస్, వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లను ప్రత్యేక పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు.  అంటే, తప్పుడు సమాచారం ఇచ్చారని, క్రిమినల్ రికార్డు ఉందని, లేదంటే గడువు ముగిసిన తర్వాత వారు కెనడా విడిచి వెళతాడన్న నమ్మకం లేనప్పుడు సరిహద్దు అధికారులు వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. కెనడా తాజా నిర్ణయంతో దాదాపు 7 వేల అదనపు తాత్కాలిక రెసిడెంట్ వీసాలు వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లు రద్దయ్యే అవకాశం ఉంది. విదేశీయులు, ముఖ్యంగా భారతీయుల పర్మిట్లు రద్దయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే, కెనడా పోర్టుల నుంచి దేశంలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధం విధించవచ్చు. లేదా వారు కెనడాను విడిచి వెళ్లాల్సి రావచ్చు.  

Canada
Immigration Regulations
Indian Students
  • Loading...

More Telugu News