Malavika Mohanan: సెట్ లో ప్రభాస్ ను చూసి ఆశ్చర్యపోయా: మాళవిక మోహనన్

malavika mohanan Comments on Prabhas

  • అంత పెద్ద స్టార్ సెట్‌లో నార్మల్‌గా ఉంటారన్న మాళవిక
  • బాహుబలితో బిగ్ ఫ్యాన్‌ నయ్యానని వెల్లడి
  • ఆయనతో కలిసి పని చేయాలని కలలు కన్నానన్న మాళవిక

ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’లో హీరోయిన్‌గా నటించిన కేరళ బ్యూటీ మాళవిక మోహనన్.. ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. బాహుబలి నుంచి తాను ప్రభాస్‌కు పెద్ద అభిమానినని, అప్పటి నుంచి ఆయనతో కలిసి పని చేయాలని కలలు కన్నానని మాళవిక చెప్పారు.

'ది రాజాసాబ్' షూటింగ్‌లో ప్రభాస్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. అంత పెద్ద స్టార్ చాలా నార్మల్‌గా, సపోర్టివ్‌గా ఉండటం, సెట్‌లో ఉన్న అందరితో సరదాగా గడపడం, టీమ్ మొత్తానికి మంచి ఫుడ్ పంపించడం, దగ్గర ఉండి బిర్యానీ తినిపించడం వంటివి చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. 'నిజంగా ప్రభాస్ చాలా స్వీట్' అంటూ మాళవిక మోహనన్ ప్రభాస్‌ను ప్రశంసించారు. 

Malavika Mohanan
Prabhas
Movie News
bahubali
  • Loading...

More Telugu News