Sundeep kishan: పీపుల్స్‌ స్టార్‌గా సందీప్‌ కిషన్‌ను ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకుంటారా?

Will the audience accept Sundeep Kishan as the Peoples Star

  • తన పేరుకు ముందు పీపుల్స్‌ స్టార్‌ ట్యాగ్‌ను యాడ్‌ చేసుకున్న సందీప్‌ 
  • ఆర్‌.నారాయణ మూర్తి ట్యాగ్‌ను సందీప్‌ యాడ్‌ చేసుకోవడంపై పలువురి అభ్యంతరం 
  • సందీప్‌ కిషన్‌ నీకు ఇది తగునా అంటూ నెటిజన్ల మండిపాటు


తొలిసారిగా టాలీవుడ్‌లో ఓ విచిత్ర సమస్య ఎదురైంది.. నిజంగా ఇలాంటి ఓ ఇష్యూ వస్తుందని కూడా ఎవరూ ఊహించి ఉండరు. సినిమా అంటే సామాజిక ప్రయోజనం అని నమ్మి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కోసం, ప్రజల సమస్యలపై సినిమాలు తీస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుని పీపుల్స్‌ స్టార్‌గా అందరికి సుపరిచితుడైన నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి. ఆయనని ప్రేక్షకులు పీపుల్స్‌ స్టార్‌గా పిలుచుకుంటారు. ఇది ఆయన పేరుకు ముందు ట్యాగ్‌లైన్‌గా యాడ్‌ అయ్యింది. 

అయితే ఇప్పుడు ఈ పీపుల్స్‌ స్టార్‌ ట్యాగ్‌లైన్‌ను తన పేరుకు ముందు తగిలించుకున్నాడు కథానాయకుడు సందీప్‌ కిషన్‌. ఈ యువ హీరో నటిస్తున్న తాజా చిత్రం 'మజాకా' చిత్రం నుంచి తన పేరుకు ముందు పీపుల్స్‌ స్టార్‌ను యాడ్‌ చేసుకున్నాడు. అయితే ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన 'మజాకా' చిత్రం ప్రెస్‌మీట్‌లో పలువురు పాత్రికేయులు ప్రశ్నించారు. అయితే ఆర్‌.నారాయణమూర్తికి పీపుల్స్‌ స్టార్‌ అనే ట్యాగ్‌ ఉన్న విషయమే తనకు తెలియదని సందీప్‌ సమాధానం చెప్పారు. 

అంతేకాదు ఈ విషయంలో మేము ఆయనకు ఏం చేయాలో అది చేస్తాం. మేము ఆయన్ని కన్విన్స్ చేసుకుంటాం. మీకేంటి ప్రాబ్లెమ్‌? అనే రీతిలో అన్సర్‌ ఇచ్చాడు సందీప్. ఇక 'మజాకా' నిర్మాత అనిల్ సుంకర మాత్రం సందీప్‌ కిషన్‌ స్వభావం, ఆయన్ని ప్రజలు రిసీవ్‌ చేసుకుంటున్న తీరును బట్టి తానే ఆయనకు ఈ ట్యాగ్‌ను ఇచ్చానని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. సందీప్‌ తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆర్‌. నారాయణమూర్తి లాంటి నటుడికే పీపుల్స్‌ స్టార్‌ అనే పదం కరెక్ట్‌గా సరిపోతుందని, ఇప్పటికైనా సందీప్‌ ఈ విషయంలో రియలైజ్ అయ్యి తన నిర్ణయం మార్చుకోవాలని నారాయణమూర్తి అభిమానులు అంటున్నారు. 

అంతేకాదు సందీప్‌ ఇలా వేరే వాళ్ల ట్యాగ్‌లపై కాకుండా తన కెరీర్‌పై దృష్టి పెట్టుకుని, ముందుగా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని, ఆ తరువాత ఇలాంటి బిరుదులు, ట్యాగ్‌లపై దృష్టి పెట్టాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. 

  • Loading...

More Telugu News