Narendra Modi: పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

PM Modi releases PM Kisan funds

  • 19వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
  • 9.7 కోట్ల మంది రైతులకు రూ.22 వేల కోట్లను విడుదల చేసిన కేంద్రం
  • ఒక్కో రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.6 వేలు

రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం-కిసాన్ నిధులు సోమవారం జమ అయ్యాయి. పీఎం కిసాన్ యోజన కింద 19వ విడత నిధులను ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా రూ.22 వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. ఈ నిధులతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో విడత రూ.2 వేల చొప్పున ఏడాదికి మూడు విడతలు మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.

  • Loading...

More Telugu News