Roja: జగన్ తో భేటీ అయిన మాజీ మంత్రి రోజా

Roja meets Jagan

  • తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనను కలిసిన రోజా
  • గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న హైకమాండ్!
  • ఇదే అంశంపై జగన్, రోజా మధ్య చర్చ జరిగినట్టు సమాచారం

వైసీపీ అధినేత జగన్ ను ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో నగరి నియోజకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాలపై వీరు చర్చించినట్టు సమాచారం. 

దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి రెండో కుమారుడు, నగరి నేత గాలి జగదీశ్ ను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ అధిష్ఠానం సిద్ధమయిందనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వచ్చిన వార్తల ప్రకారం ఇప్పటికే వైసీపీలో జగదీశ్ చేరాల్సి ఉంది. అయితే, రోజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన చేరికకు బ్రేక్ పడిందని చెపుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై రోజాతో జగన్ చర్చించినట్టు సమాచారం. ఈ భేటీతో వైసీపీలో జగదీశ్ చేరికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరి నియోజకర్గంలో వైసీపీలో చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

  • Loading...

More Telugu News