Partners: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాళ మూవీ!

Partners Movie Update

  • మలయాళంలో రూపొందిన 'పార్ట్ నర్స్'
  • క్రితం ఏడాది జులైలో వచ్చిన సినిమా 
  • నకిలీ బ్యాంకు చుట్టూ తిరిగే కథ
  • ఓటీటీ ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న కంటెంట్  


మలయాళంలో ఈ మధ్య కాలంలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ వచ్చిన సినిమాగా 'పార్ట్ నర్స్' సినిమా కనిపిస్తుంది. దినేశ్ నిర్మించిన ఈ సినిమాకి నవీన్ జాన్ దర్శకత్వం వహించాడు. క్రితం ఏడాది జులై 5వ తేదీన ఈ సినిమా విడుదలైంది. జనవరి 31 వ తేదీ నుంచి 'సైనా ప్లే' ఓటీటీ ఫాట్ ఫామ్ పై ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాకి థియేటర్లపై నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓటీటీ వైపు నుంచి ఈ కంటెంట్ మరిన్ని మార్కులు తెచ్చుకుందని అంటున్నారు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన లభిస్తుండటం విశేషం. ధ్యాన్ శ్రీనివాసన్ .. సంజూ శివరామ్ .. కళాభవన్ షాజోన్ .. రోని డేవిడ్ రాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, ప్రకాశ్ అలెక్స్ సంగీతాన్ని సమకూర్చాడు. 

కథ విషయానికి వస్తే .. హీరో ఒక చిన్నపాటి ప్రైవేట్ బ్యాంకులో క్యాషియర్ గా చేరతాడు. ఆ బ్యాంకు  సంబంధించిన అన్ని వ్యవహారాలను విజయ్ చూస్తూ ఉంటాడు. వచ్చిన డబ్బు వచ్చినట్టు బయటికి వెళ్లిపోతూ ఉండటం చూసిన హీరోకి అనుమానం వస్తుంది. అక్కడ పనిచేస్తున్న వాళ్లందరికీ నేరచరిత్ర ఉందని అతను గ్రహిస్తాడు. అది నకిలీ బ్యాంకు అనే విషయం అతనికి అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ.

  • Loading...

More Telugu News