Hit 3 Teaser: 'హిట్-3' టీజర్ విడుదల.. ఊర మాస్ పోలీస్‌గా నాని!

- ఈరోజు నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు
- ఈ సందర్భంగా 'హిట్-3' టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్
- టీజర్‌లో ఊహించని షాకులు బోలెడిచ్చిన చిత్రం యూనిట్
- ఒళ్లు గగుర్పొడిచేలా 'హిట్-3' విజువల్స్
ఈరోజు నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హిట్-3 టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 1న విడుదల కానుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో ఊహించని షాకులు బోలెడిచ్చారు. శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. అక్కడ జరిగే వరుస హత్యలు.. పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ వాటిని ఎలా ఛేదించాడు అనే కోణంలో ఈ సినిమా ఉండనుంది.
ఊర మాస్ పోలీస్ గా నాని భయంకరంగా ఉన్నాడు. రావు రమేశ్ లాంటి ఒకరిద్దరిని తప్ప ఇతర పాత్రధారులను రివీల్ చేయకుండా టీజర్ కట్ చేశారు. మిక్కీ జె మేయర్ బీజీఎం మరో స్థాయిలో ఉంది. మొత్తానికి 'హిట్ 3 ది థర్డ్ కేస్' ఆషామాషీగా ఉండదని మాత్రం అర్థమైపోయింది. ఇంతకుముందు నాని నటించిన 'దసరా' సినిమా కంటే చాలా తక్కువనిపించే స్థాయిలో 'హిట్ 3' విజువల్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. 'హిట్' యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు శైలేశ్ కొలను మరోసారి మోస్ట్ వయొలెంట్ కథతో వస్తున్నారు.