AP Assembly Session: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. బీఏసీ సమావేశం ప్రారంభం

AP Assembly adjourned to tomorrow

  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
  • గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే రేపటికి వాయిదా పడ్డ సభ
  • సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ

ఏపీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వైసీపీ సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. వైసీపీ వాకౌట్ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ప్రసంగం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ గవర్నర్ ను వాహనం వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. 

సభ వాయిదా పడిన వెంటనే బీఏసీ సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అజెండాను నిర్ణయించనున్నారు.

AP Assembly Session
BAC
  • Loading...

More Telugu News