Robbery: హుజురాబాద్ లో దొంగల బీభత్సం.. వృద్ధులపై దాడి

- 80 తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
- ఆదివారం రాత్రి ఘటన
- కత్తులతో ఇద్దరిని గాయపర్చిన దొంగలు
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. వృద్ధ దంపతులను కత్తులతో బెదిరించి ఇంట్లోని బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి ప్రతాపవాడలోని రాఘవరెడ్డి ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. కత్తులతో బెదిరించి 80 తులాల బంగారు నగలు, రూ.7 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనలో ప్రతాపరెడ్డికి, ఆయన భార్యకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వృద్ధులను ఆసుపత్రికి తరలించారు.
రాఘవరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ప్లాన్ లో భాగంగా దొంగలు ఇంటి ముందున్న నీళ్ల మోటార్ ఆన్ చేశారని, ట్యాంక్ నిండి నీళ్లు కిందపడడంతో ఆ శబ్దానికి ఇంట్లో వాళ్లు మేలుకున్నారని గుర్తించారు. ఇంట్లో నుంచి వృద్ధులు బయటకు రాగానే దొంగలు వారిపై దాడి చేసి ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు తెలిపారు.