AP Assembly Session: అసెంబ్లీకి చేరుకున్న చంద్రబాబు, జగన్

Chandrababu and Jagan reaches to AP Assembly to attend budget sessions

  • కాసేపట్లో ప్రారంభంకానున్న బడ్జెట్ సమావేశాలు
  • అసెంబ్లీకి చేరుకున్న జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు
  • గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడనున్న సభ

ఏపీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం మేరకు వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారు. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీకి చేరుకుంటారు. 

గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ జరగాల్సిన పని దినాలు, అజెండాపై నిర్ణయం తీసుకుంటారు.

  • Loading...

More Telugu News