Mumaith Khan: యూసఫ్ గూడలో ముమైత్ ఖాన్ అకాడమీ... వివరాలు ఇవిగో!

mumait khan director of welyke makeup and hair academy
  • ‘ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే’ పాటతో ఉర్రూతలూగించిన ముమైత్  
  • బ్యూటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రంగంలోకి అడుగులు 
  • వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమి డైరెక్టర్‌గా మీడియా ముందుకు
‘ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే’ అంటూ ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులేసి యువతను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో పలు పాత్రల్లో కూడా నటించి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ముమైత్ ఖాన్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా వున్నారు. 

చాలా రోజుల తర్వాత ఇప్పుడు మరో రంగంలో అడుగుపెడుతూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమి డైరెక్టర్‌గా బ్యూటీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ సంస్థ హైదరాబాద్ యూసుఫ్ గూడలో తన బ్రాంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. బ్యూటీ పరిశ్రమపై మక్కువ ఉన్న వారిని ప్రోత్సహించేందుకు ఈ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఈ రంగంపై అవగాహన కల్పించడంతో పాటు బ్రైడల్ అండ్ హెయిర్ మేకప్ లో శిక్షణ ఇవ్వబోతున్నామని, విద్యార్ధులను ప్రపంచ స్థాయిలో ట్రైయిన్డ్ స్పెషలిస్ట్‌లుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముమైత్ ఖాన్ తెలిపారు. తమ సంస్థ బ్రైడల్, మేకప్, హెయిర్ స్టైలింగ్‌తో పాటు కాస్మోటాలజీ, స్కిన్ కేర్, వెల్‌నెస్‌లో నైపుణ్యం పెంచేందుకు కృషి చేయబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో ఫౌండర్ కెయిత్ జావెద్, ఆర్టిస్టులు జ్యోతి, అక్సా ఖాన్, సింగర్ రోల్ రైడా, డాన్స్ మాస్టర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.  
.  
Mumaith Khan
Welyke Makeup and Hair Academy
Hyderabad

More Telugu News