MLA Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్

threatening calls to bjp mla rajasingh

  • ఆదివారం రెండు సార్లు బెదిరింపు కాల్స్ 
  • తల నరికేస్తాం అంటూ దుండగుల హెచ్చరికలు
  • యోగి, మోదీ  కూడా రక్షించలేరన్న దుండగులు

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆదివారం అరగంట వ్యవధిలోనే రెండుసార్లు కాల్స్ చేసి చంపేస్తామంటూ రాజాసింగ్‌ను హెచ్చరించారు. దీనిపై రాజాసింగ్ స్పందించారు. తనకు రెండు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు.

"ఈ రోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం ఇన్షా అల్లా (అల్లా దయతో)" అని హెచ్చరించినట్లు రాజాసింగ్ తెలిపారు. "ఇప్పుడు మీ యోగి, మీ మోదీ కూడా రక్షించలేరు" అని దుండగులు బెదిరించారన్నారు. మొదటి ఫోన్ కాల్ మధ్యాహ్నం 3.30 గంటలకు, ఆ తర్వాత 3.54 గంటలకు వచ్చినట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతంలో కూడా పలుమార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నందున ఆయనకు ప్రభుత్వం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాజాసింగ్ 2014 ఎన్నికల నుంచి వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 

  • Loading...

More Telugu News