Chandrababu: టీడీపీ నేత బీదా రవిచంద్ర కుమారుడి వివాహానికి హాజరైన సీఎం చంద్రబాబు

CM Chandrababu attends wedding in Nellore

  • నేడు రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతల ఇంట శుభకార్యాలు
  • తిరుపతిలో నరసింహ యాదవ్ కుమారుడి పెళ్లికి చంద్రబాబు హాజరు
  • అనంతరం నెల్లూరు వచ్చిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతల ఇంట జరిగిన శుభకార్యాలకు హాజరయ్యారు. తిరుపతి సమీపంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి పెళ్లికి హాజరైన చంద్రబాబు... ఆ తర్వాత నెల్లూరు వచ్చారు. 

నెల్లూరులో టీడీపీ నేత బీదా రవిచంద్ర యాదవ్ కుమారుడి వివాహ కార్యక్రమానికి విచ్చేశారు. నూతన వధూవరులు దివిజ, గోకుల్ రిశ్వంత్ లను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు పర్యటన సందర్భంగా చంద్రబాబుకు జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News