Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ

- నేడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ మ్యాచ్
- వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయి అందుకున్న కోహ్లీ
- వేగంగా 14 వేల పరుగులు సాధించిన బ్యాటర్ సచిన్ ను వెనక్కినెట్టిన కోహ్లీ
- 350 ఇన్నింగ్స్ ల్లో 14 వేల పరుగులు చేసిన సచిన్
- 287 ఇన్నింగ్స్ ల్లోనే 14 వేల రన్స్ సాధించిన కోహ్లీ
టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ మ్యాస్ట్రో సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. ఇవాళ టీమిండియా-పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ద్వారా కోహ్లీ వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా, వన్డే క్రికెట్లో వేగంగా 14 వేల పరుగులు సాధించిన బ్యాటర్ గా సచిన్ ను వెనక్కి నెట్టాడు.
14 వేల పరుగుల మార్కు అందుకునేందుకు సచిన్ కు 350 ఇన్నింగ్స్ లు ఆడగా... కోహ్లీ కేవలం 287 ఇన్నింగ్స్ ల్లోనే ఈ ఘనత నమోదు చేశాడు.
కాగా, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. రెండోస్థానంలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర ఉన్నాడు. సంగక్కర 50 ఓవర్ల ఫార్మాట్ లో 14,234 పరుగులు చేశాడు.