Naga Chaitanya: క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులతో ఆడిపాడిన నాగచైతన్య, శోభిత... ఫొటోలు ఇవిగో!

- సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ కు వెళ్లిన చైతూ, శోభిత
- చిన్నారులతో సరదాగా గడుపుతూ ధైర్యం చెప్పిన కొత్త దంపతులు
- పిల్లల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న వైనం
ప్రేమ వివాహం చేసుకున్న నాగచైతన్య, శోభిత తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నప్పటికీ... సమయం దొరికినప్పుడల్లా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ ను వీరు సందర్శించారు. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులతో వీరు కాసేపు గడిపారు.
చిన్నారులతో సరదాగా గడుపుతూ వారికి ధైర్యం చెప్పారు. వారితో కలిసి ఆడి పాడారు. డ్యాన్స్ చేశారు. చిన్నారులకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. కేర్ సెంటర్ సిబ్బందితో పిల్లల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచి మనసును చాటుకున్నారంటూ చైతూ, శోభితలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



