Akhil Akkineni: 'నాటు నాటు' పాటకు అఖిల్ స్టెప్పులు.. వీడియో వైరల్!

- దుబాయ్‌లో సన్నిహితుల వివాహ వేడుకలో అక్కినేని అఖిల్ సందడి
- 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు కాళ్లు కదిపిన యంగ్ హీరో
- నెట్టింట వీడియో వైరల్
దుబాయ్‌లో జరిగిన సన్నిహితుల వివాహ వేడుకలో అక్కినేని అఖిల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదే వేడుకలో తారక్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన, అమల, నమ్రతా శిరోద్కర్, సితార తదితరులు కూడా సందడి చేశారు. కాగా, 'ఏజెంట్' మూవీ తర్వాత బ్రేక్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.