Revanth Reddy: యాదాద్రి మహా కుంభాభిషేకంలో రేవంత్ రెడ్డి దంపతులు.. వీడియో ఇదిగో

Revanth Reddy in Yadagirigutta

  • యాదాద్రిలో ఘనంగా మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు
  • పంచకుండాత్మక మహా పూర్ణాహుతిలో పాల్గొన్న సీఎం దంపతులు
  • పంచతల విమాన గోపురం వద్ద ప్రత్యేక పూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు పంచకుండాత్మక మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం అంతరాలయం మాడ వీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్ణమయ పంచతల విమాన గోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. 



More Telugu News