Rahul Gandhi: రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi phone call to Revanth Reddy

  • ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఆరా తీసిన రాహుల్ గాంధీ
  • సహాయక చర్యల గురించి రాహుల్ కు వివరించిన రేవంత్
  • దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్న నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కూలీలు ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై రాహుల్ ఆరా తీశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. సహాయక సిబ్బంది చేపడుతున్న చర్యలను రాహుల్ కు రేవంత్ వివరించారు.

బాధితులను రక్షించేందుకు సహాయక సిబ్బంది సారంగంలో 13.5 కిలోమీటర్ల లోపల వరకు వెళ్లారు. మరో అర కిలోమీటరు వెళ్లాల్సివుండగా మట్టి, నీటి కారణంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ అడ్డంకులను అధిగమించి ప్రమాద స్థలికి వెళ్లేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News