Ajith Kumar: రేసింగ్‌లో ప‌ల్టీలు కొట్టిన కారు.. హీరో అజిత్ కుమార్‌కు మ‌రోసారి త‌ప్పిన పెను ప్ర‌మాదం!

Ajith Kumar Car Crashes Badly During Racing Event in Spain

  • స్పెయిన్‌లో జ‌రుగుతున్న రేసింగ్‌లో ప్ర‌మాదానికి గురైన అజిత్ కారు
  • మ‌రో కారును త‌ప్పించే క్ర‌మంలో ప్ర‌మాదం జరిగినట్లు స‌మాచారం
  • ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన అజిత్ రేసింగ్ టీమ్

కోలీవుడ్ స్టార్ న‌టుడు అజిత్ కుమార్‌కు మ‌రోసారి పెను ప్రమాదం త‌ప్పింది. స్పెయిన్‌లో జ‌రుగుతున్న రేసింగ్‌లో ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురైంది. దీంతో అజిత్ వాహ‌నం ట్రాక్‌పై ప‌ల్టీలు కొట్టింది. మ‌రో కారును త‌ప్పించే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జరిగినట్లు   తెలుస్తోంది. 

కాగా, ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఆయ‌న కారులోంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. ఆయ‌న క్షేమంగానే ఉన్న‌ట్లు తెలిపింది. ఈ ప్ర‌మాదం త‌ర్వాత కూడా ఆయ‌న రేసింగ్ కొన‌సాగించారు.

ఇక గ‌త నెల‌లో దుబాయ్‌లో గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధ‌న చేస్తున్న స‌మ‌యంలో కూడా అజిత్ కారు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. ఆయ‌న కారు స‌మీపంలోని గోడ‌ను బ‌లంగా ఢీకొట్ట‌డంతో వాహ‌నం ముందు భాగం డ్యామేజ్ అయింది. ఈ ప్ర‌మాదం నుంచి కూడా అజిత్ సుర‌క్షితంగానే బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ రేసింగ్ ఈవెంట్‌లో ఆయ‌న టీమ్ మూడో స్థానంలో నిలిచింది. 

కాగా, ఈ కోలీవుడ్ స్టార్ హీరోకు రేసింగ్ అంటే అమిత ఇష్టం. అందుకే సినిమా షూటింగ్ లేకుంటే కార్లు, బైక్స్ తో చ‌క్క‌ర్లు కొడుతుంటారు. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు అజిత్ ప్ర‌త్యేకంగా ఓ స్టార్ట‌ప్‌ను కూడా ఏర్పాటు చేశారు. 

View this post on Instagram

A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing)

  • Loading...

More Telugu News