Amaravati: అమరావతిలో పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామగ్రి

- వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన అమరావతి పనులు
- ఐదేళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణ సామగ్రి
- ఏపుగా పెరిగిన మొక్కలు, చెత్తా చెదారం తొలగిస్తుండటంతో బయటపడుతున్న నాటి నిర్మాణ సామగ్రి
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి పనులు ఎక్కడివక్కడ నిలిపోయాయి. ఐదేళ్లపాటు అమరావతి వైపు ఎవరూ చూడకపోవడంతో పిచ్చిమొక్కలు మొలిచి ఆ ప్రాంతమంతా అడవిలా తయారైంది. దీంతో రాజధానిలో నిర్మాణాల కోసం తరలించిన సిమెంట్ బస్తాలు, ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి అలాగే ఉండిపోయి ఎండకు ఎండి వానకు తడిసి పనికిరాకుండా పోయింది.
ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా ఏపుగా పెరిగిన మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేస్తుండటంతో పాడైపోయిన వందలాది సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామగ్రి బయటపడుతోంది.