Forbes List: కుబేరులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో మన దేశం ర్యాంకు ఎంతంటే...!

- అపర సంపన్నులు ఉన్న దేశాల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్ పత్రిక
- మొదటి రెండు స్థానాల్లో ఆమెరికా, చైనా
- 200 మంది బిలియనీర్లతో మూడు స్థానంలో ఉన్న భారత్
పెట్టుబడిదారీ అనుకూల వ్యవస్థల కారణంగా ప్రపంచంలో ఏటా సంపన్నుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి ఎందరో సంపన్నులు తమ వ్యాపార దక్షత, వ్యూహాలతో తమ సంపదను పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫోర్బ్స్ పత్రిక అపర సంపన్నులు ఉన్న దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
అత్యధిక సంపన్నులు ఉన్న దేశంగా అమెరికా తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో చైనా ఉంది. అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 813 ఉండగా, చైనాలో అపర కుబేరుల సంఖ్య 406గా ఉంది. జాబితాలో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 200గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే కొత్తగా 31 మంది బిలియనీర్లుగా మారారు. భారతీయ బిలియనీర్ల సంపద 954 బిలియన్ డాలర్లు. భారత్‌లో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ సంపద విలువ 116 బిలియన్ డాలర్లుగా ఉంది.