Mastan Sai: బయటపడుతున్న మస్తాన్ సాయి లీలలు.. హార్డ్ డిస్క్‌లో వేలకొద్దీ ఫొటోలు, ఆడియోలు, వీడియోలు!

Hundreds of videos found in Mastan Sai hard disk

  • మస్తాన్ సాయిని మూడు గంటలపాటు విచారించిన పోలీసులు
  • అతడి హార్డ్‌ డిస్క్‌లో 17 ఫోల్డర్లు 
  • వాటి నిండా అమ్మాయిల నగ్న వీడియోలు.. ఫొటోలు
  • లావణ్య, ఆమె స్నేహితురాళ్లను కూడా లోబరుచుకున్న వైనం
  • డ్రగ్స్ గురించి అడిగిన ప్రశ్నలకు నోరు విప్పని మస్తాన్ సాయి

విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య ఫిర్యాదుతో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు అతడిని మూడు రోజులపాటు విచారించారు. ఈ సందర్భంగా అతడి హార్డ్ డిస్క్‌లో మొత్తం 17 ఫోల్డర్లను గుర్తించారు. వాటిని అతడి ముందే తెరిచారు. వాటిలో 505 వీడియోలుండగా, అందులో సగానికిపైగా నగ్నంగా ఉన్న యువతులవే కావడం గమనార్హం. అలాగే, ఆరుగురు యువతుల వీడియో కాల్స్ కూడా ఉన్నాయి.

ఇవి కాకుండా యువతులతో తన గదిలో ప్రైవేటుగా ఉన్న సమయంలో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. లావణ్య, ఆమె స్నేహితురాళ్లను కూడా మస్తాన్ సాయి లోబరుచుకున్నట్టు గుర్తించారు. బయటపడిన వీడియోల్లో మస్తాన్ సాయి భార్యకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇలా దాదాపు మూడేళ్లుగా రహస్యంగా సేకరించిన ఫొటోలున్నాయి. మొత్తం 2,500కు పైగా ఫోటోలు, 734 ఆడియో రికార్డింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్స్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసే సాఫ్ట్‌వేర్ కూడా అతడి హార్డ్ డిస్క్‌లో ఉండటం గమనార్హం. కాగా, డ్రగ్స్ కొనుగోలు గురించి మస్తాన్ సాయి నోరు విప్పలేదు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరెవరికి ఇచ్చారు? అన్న అధికారుల ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News