Kamal Haasan: అప్పుడు రాజకీయాల్లోకి రాకుండా ఉండటమే నా మొదట ఓటమి: కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

- రెండు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి రాకుండా వెనుకంజ వేశానన్న కమల్ హాసన్
- అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే మంచి స్థితిలో ఉండేవాడినని వ్యాఖ్య
- రాష్ట్రానికి పార్టీ సేవలు కొనసాగుతాయని స్పష్టీకరణ
రెండు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి రాకుండా వెనుకంజ వేయడమే తన మొదటి ఓటమి అని ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. తాను అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే మంచి స్థితిలో ఉండేవాడినని ఆయన అన్నారు. అభిమానులు వేరు, ఓటర్లు వేరు అనే విషయాన్ని తన ఈ ఎనిమిదేళ్ల రాజకీయ ప్రయాణంలో తెలుసుకున్నానని ఆయన అన్నారు. తమ పార్టీకి ఆఖరి ఓటరు ఉన్నంతవరకు రాష్ట్రానికి పార్టీ సేవలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలందరినీ సమైక్యపరిచేది తమిళ భాష అన్నారు. తాను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి కారణం తమిళ ప్రజలే అని ఆయన అన్నారు. తమిళ భాష ఆకాశమంత ఎత్తులో ఉందని, దీనిని ఎవరూ కిందకు పడవేయలేరని అన్నారు. ఈ సంవత్సరం పార్లమెంటులో తొలిసారి పార్టీ వాణి వినిపించనుందని కమల్ హాసన్ తెలిపారు.