Group-2 Mains: రేపటి గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయలేం... ప్రభుత్వ లేఖకు బదులిచ్చిన ఏపీపీఎస్సీ

APPSC decides to conduct Group2 Mains Exam as per schedule

  • ఏపీలో రేపు గ్రూప్-2 మెయిన్స్
  • వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు
  • ఏపీపీఎస్సీకి లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం
  • రేపటి పరీక్ష యథాతథంగా నిర్వహిస్తున్నామన్న ఏపీపీఎస్సీ

రాష్ట్రంలో రేపు (ఫిబ్రవరి 23) జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల ఆందోళలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ బదులిచ్చింది. రేపటి పరీక్షను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అందుకే రేపు జరగాల్సిన పరీక్షను షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా నిర్వహిస్తున్నట్టు తెలిపింది. 

2023లో గ్రూప్-2 పరీక్షల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం... రోస్టర్ పాయింట్ల విధానంలో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దాకే గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేపడుతున్నారు. 

గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. అయితే, ఈ దశలో పరీక్షను వాయిదా వేయలేమని ఏపీపీఎస్సీ ప్రత్యుత్తరం ఇచ్చింది.

  • Loading...

More Telugu News