Ram Pothineni: హీరో రామ్‌ను కలిసిన మంత్రి కందుల దుర్గేష్

Minister Kandula Durgesh Meets Ram Pothineni

  • రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటోన్న రామ్‌ తాజా చిత్రం 
  • షూటింగ్ లోకేషన్‌కు విచ్చేసిన కందుల దుర్గేష్‌ 
  • సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్న మంత్రి

కథానాయకుడు రామ్ తన తాజా చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మహేష్ బాబు.పి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్నారు. 'డబుల్ ఇస్మార్ట్' వంటి భారీ పరాజయం తరువాత హీరో రామ్ నటిస్తున్న చిత్రమిది. రామ్ కెరీర్‌లో 22వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఈ చిత్రం షూటింగ్ సెట్‌ను శనివారం (ఈ రోజు) ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా రామ్ పోతినేనితో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ ''రామ్‌లోని ఎనర్జీ, డ్యాన్సులు నాకెంతో ఇష్టం. రబ్బరు స్ప్రింగ్ తరహాలో బాడీని డ్యాన్స్ మూమెంట్స్‌తో మౌల్డ్ చేస్తాడు. ఇప్పటి వరకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో, గోదావరి నది తీర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసిన సినిమాలు దాదాపుగా విజయాలుగా నమోదు చేసుకున్నాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోనే విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 

ఇక రెండు వారాల క్రితం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో మొదలైంది. ఈ చిత్రీకరణ కోసం హాజరైన హీరో రామ్‌కు ఇక్కడ ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, సంగీతం: వివేక్. 


  • Loading...

More Telugu News