Shoaib Aktar: చూస్తుండండి... ఇతడే టీమిండియా రైజింగ్ స్టార్: షోయబ్ అక్తర్

- దుబాయ్ లో అభిషేక్ శర్మను కలిసి అక్తర్
- అభిషేక్ శర్మకు గొప్ప భవిష్యత్ ఉందని వెల్లడి
- యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ అని కితాబు
ఇటీవల వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా నుంచి బలంగా వినిపిస్తున్న పేరు అభిషేక్ శర్మ. తొలి బంతి నుంచే బాదుడు, బౌలర్ ఎవరన్నది లెక్కజేయకపోవడం, కౌంటర్ అటాక్ చేసే లక్షణం... అభిషేక్ శర్మను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇటీవల కాలంలో అతడి బ్యాట్ నుంచి పరుగులు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా, దుబాయ్ లో అభిషేక్ శర్మను పాకిస్థాన్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ కలిశాడు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మపై అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు.
"అభిషేక్ శర్మ ఫెంటాస్టిక్, అమేజింగ్ ఆటగాడు. ఈ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ కు గొప్ప భవిష్యత్తు ఉంది. అతడి స్ట్రెంగ్త్ అమోఘం. చూస్తూ ఉండండి... టీమిండియా రైజింగ్ స్టార్ ఇతడే. అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. అభిషేక్ శర్మను కలిసినప్పటి వీడియో కూడా పంచుకున్నాడు.