Gowtham Reddy: ఫైబర్ నెట్ లో చంద్రబాబు భారీ అవినీతి చేశారు: గౌతమ్ రెడ్డి

- ఫైబర్ నెట్ ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారన్న గౌతమ్ రెడ్డి
- వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ ను లాభాల బాటలోకి తెచ్చామని వ్యాఖ్య
- ఫైబర్ నెట్ లో చంద్రబాబు భారీ అవినీతి చేశారని ఆరోపణ
లాభాల బాటలో ఉన్న ఫైబర్ నెట్ ను చంద్రబాబు నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. ఫైబర్ నెట్ ను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు.
వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ ను లాభాల బాటలోకి తెచ్చామని... అలాంటి సంస్థను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని గౌతమ్ రెడ్డి విమర్శించారు. 2014-19లోనే ఫైబర్ నెట్ లో చంద్రబాబు భారీ అవినీతి చేశారని... దీనిపై తమ హయాంలో విచారణ జరిపించామని తెలిపారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలను సీఐడీ నిరూపించిందని చెప్పారు. ఫైబర్ నెట్ ప్రతి కాంట్రాక్టులో అవినీతి జరిగిందని అన్నారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత తన మీద ఉన్న కేసులను చంద్రబాబు మాఫీ చేయించుకుంటున్నారని తెలిపారు.