Mahath Raghavendra: కచ్చితంగా యూత్ కోసమే... ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ సిరీస్!

- యూత్ కోసం రూపొందిన సిరీస్
- ప్రేమ-పెళ్లి నేపథ్యంలో నడిచే కథ
- రొమాంటిక్ కామెడీ జోనర్లో పలకరించే కంటెంట్
- ఈ నెల 28వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
తమిళ సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ లు కూడా ఇప్పుడు తెలుగులోకి దిగిపోతున్నాయి. అలా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి 'ఎమోజీ' వెబ్ సిరీస్ సిద్ధమవుతోంది. రొమాంటిక్ కామెడీ జోనర్లో నిర్మితమైన సిరీస్ ఇది. తమిళంలో 2022లో ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను అలరించనుంది.
ఈ సిరీస్ లో మహత్ రాఘవేంద్ర, మానసా చౌదరి, దేవిక ప్రధానమైన పాత్రలను పోషించారు. సెంథిల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి సంపత్ నిర్మాతగా వ్యవహరించారు. 2022లో వచ్చిన మంచి రొమాంటిక్ కామెడీ సిరీస్ గా ఇది మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సిరీస్, ఈ నెల 28వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో ఒక యువకుడు, యువతీ ప్రేమించుకుంటారు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఆ యువతికి దూరమైన యువకుడు, మరో అమ్మయితో జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలోనే మొదటి ప్రియురాలు అతని జీవితంలోకి అడుగుపెడుతుంది. అందుకుగల కారణాలు ఏమిటి? అనేదే ఈ సిరీస్ కథ. ప్రేమ-పెళ్లి నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.