Actor Prudhvi: తగ్గేదే లేదంటున్న పృథ్వీ... రోజుకు 11 సార్లు నీళ్లు తాగాలంటూ ట్వీట్

- ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీ
- సినీ వేదికల పైనుంచి కామెంట్స్ చేస్తే జనాలు ఫీలవుతున్నారని వెల్లడి
- అందుకే ఎక్స్ లోకి వచ్చానని వివరణ
- వేడి 151 డిగ్రీలకు చేరే అవకాశం ఉందంటూ తాజా ట్వీట్
టాలీవుడ్ కమెడియన్, జనసేన నేత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఎక్స్ సామాజిక మాధ్యమంలోకి అడుగుపెట్టాడో లేదో... వరుస ట్వీట్లతో కదం తొక్కుతున్నాడు. తాజాగా, రోజుకు 11 సార్లు నీళ్లు తాగండి... అసలే ఎండాకాలం అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. వేడి 151 డిగ్రీల ఫారెన్ హీట్ కి రీచ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి... నా తోటి సోదరుల కోసం ఆరోగ్య చిట్కాలు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇటీవల ఓ సినిమా వేడుకలోనూ వేదికపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలే చేసిన నటుడు పృథ్వీపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. వేదికల పైనుంచి చేస్తే విమర్శలు వస్తున్నాయని, జనాలు ఫీల్ అవుతున్నారని, అందుకే ఎక్స్ లోకి ఎంటర్ అవుతున్నానని పృథ్వీ తన తొలి ట్వీట్ లో వివరించారు.