Tirumala: తిరుమల కొండపై మోస్తరు రద్దీ

Tirumala info and details

  • టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం
  • 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ.3.52 కోట్ల ఆదాయం

తిరుమల కొండపై భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ కలిగిన భక్తులు కొద్ది సేపట్లోనే దర్శనం పూర్తి చేసుకుని వెలుపలికి వస్తున్నారు. 

నిన్న స్వామివారిని 65,327 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,804 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.52 కోట్ల ఆదాయం వచ్చింది.

  • Loading...

More Telugu News