Revanth Reddy: ప్రజాభవన్ లో రేవంత్ అధ్యక్షతన కీలక సమావేశం

- బీసీ నేతలతో సమావేశం కానున్న సీఎం రేవంత్
- హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు
- బీసీ నేతలకు మార్గనిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జరగనుంది. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో బీసీ నేతలకు రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గనిర్దేశం చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగణన చేపట్టడం, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందనే సంకేతాలను బలంగా చాటేందుకు ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనుంది. బీసీ నేతల భాగస్వామ్యంతో ప్రభుత్వ విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ భేటీ కీలకంగా నిలుస్తుందని నేతలు భావిస్తున్నారు.