Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ: సఫారీల చేతిలో ఆఫ్ఘన్లకు తప్పని ఓటమి

Afghanistan loses to SA in Champions Trophy

  • ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా × ఆఫ్ఘనిస్థాన్
  • కరాచీలో మ్యాచ్
  • 107 పరుగులతో విజయం సాధించిన దక్షిణాఫ్రికా

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ఆల్ రౌండ్ నైపుణ్యం కనబర్చిన దక్షిణాఫ్రికా 107 పరుగులతో భారీ విజయం అందుకుంది. సంచలన విజయాలు సాధించడం అలవాటుగా మార్చుకున్న ఆఫ్ఘన్లకు ఈ మ్యాచ్ లో ఏమీ కలిసిరాలేదు. 

కరాచీలో జరిగిన ఈ గ్రూప్-బి మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (103) సెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగులు చేసింది. 

అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్ జట్టు 43.3 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. రహ్మత్ షా 90 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. అతడికి ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం అందలేదు. 

కెప్టెన్ హష్మతుల్లా షాహిది (0) డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 3, లుంగీ ఎంగిడి 2, వియాన్ ముల్డర్ 2, మార్కో యన్సెన్ 1, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీశారు.

Champions Trophy 2025
South Africa
Afghanistan
Karachi
  • Loading...

More Telugu News