Bird Flu: గుంటూరులో ఉచితంగా చికెన్ వంటకాల పంపిణీ... పోటెత్తిన జనాలు

Huge response for Chicken Food Mela in Guntur

  • ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం
  • ప్రజల్లో ఆందోళన
  • గుంటూరులో బర్డ్ ఫ్లూ అవగాహన కార్యక్రమం
  • పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చికెన్ ఫుడ్ మేళా

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. ఏపీ, తెలంగాణలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. కోడి మాంసం తినేందుకు జనాలు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్ లో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చికెన్ ఫుడ్ మేళాలో ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదని చెప్పేందుకే ఈ ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ హాజరయ్యారు. 

ఇక, ఉచితంగా చికెన్ వంటకాల పంపిణీ అనేసరికి జనాలు భారీగా తరలివచ్చారు. ఫుడ్ మేళా ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసేయాల్సి వచ్చింది.

Bird Flu
Chicken Food Mela
Guntur
Andhra Pradesh
Telangana

More Telugu News