Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమం... కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లింది పరామర్శకేనా?

BRS MLA Maganti Gopinath health condition critical

  • నాలుగు రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్
  • పరిస్థితి విషమంగా ఉన్నట్టు బంధువులు కూడా చెబుతున్న వైనం
  • గోపీనాథ్ ను పరామర్శించేందుకే ఆసుపత్రికి కేసీఆర్ వెళ్లినట్టు సమాచారం

బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధ పడుతున్న ఆయన గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు బంధువులు కూడా చెపుతున్నారు. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెపుతున్నాయి. అయితే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి ఆయన వెళ్లారని పార్టీ శ్రేణులు చెప్పినప్పటికీ... గోపీనాథ్ ను పరామర్శించడానికే ఆయన వెళ్లారని తెలుస్తోంది. 

గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నప్పటికీ ఆయన నిర్లక్ష్యం చేశారని... దీంతో సమస్య పెద్దదయిందని చెపుతున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ నాలుగు రోజుల క్రితం ఆయన మరింత అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించినట్టు వైద్యులు చెప్పినట్టు సమాచారం.

Maganti Gopinath
BRS
  • Loading...

More Telugu News