Stock Market: వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. భారీగా పతనమైన ఆటో స్టాక్స్

markets ends in losses

  • 424 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 117 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా నష్టపోయిన మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. ఆటో స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావాన్ని చూపింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 424 పాయింట్లు నష్టపోయి 75,311 వద్ద ముగిసింది. నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 22,795 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మరో 7 పైసలు బలహీనపడి రూ. 86.71గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (1.88%), ఎల్ అండ్ టీ (1.10%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.75%), ఏషియన్ పెయింట్స్ (0.35%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.31%).

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-6.07%), అదానీ పోర్ట్స్ (-2.57%), టాటా మోటార్స్ (-2.46%), సన్ ఫార్మా (-1.60%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.52%).

  • Loading...

More Telugu News