Jagan: ఐ మిస్ యూ... గౌతమ్: జగన్

- మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి నేడు
- భావోద్వేగంగా స్పందించిన జగన్
- 2022 ఫిబ్రవరి 21న గుండెపోటుతో కుప్పకూలిన గౌతమ్
మాజీ మంత్రి, దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మూడో వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా భావోద్వేగంగా స్పందించారు. "నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డిని మూడో వర్ధంతి సందర్భంగా ప్రేమగా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్ యూ గౌతమ్" అని ట్వీట్ చేశారు. గౌతమ్ రెడ్డితో కలిసి ఓ కార్యక్రమంలో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 21న హైదరాబాదులోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. 49 ఏళ్ల చిన్న వయసులోనే గౌతమ్ మృతి చెందడం అందరినీ కలచి వేసింది.