Sonia Gandhi: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియాగాంధీ

- నిన్న మధ్యాహ్నం గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా
- పొత్తికడుపు సమస్యతో ఆసుపత్రిలో చేరిన వైనం
- ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేసిన వైద్యులు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఆమె అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. పొత్తికడుపు సమస్యతో ఆమె ఆసుపత్రిలో చేరినట్టు గంగారామ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సోనియా ఆరోగ్యం మెరుగుపడటంతో ఆమెను వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సోనియాగాంధీ గత ఏడాది డిసెంబర్ లో 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
గత ఏడాది ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న సోనియా... లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వయనాడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.