Director Shankar: స్టార్ డైరెక్టర్ శంకర్ ఆస్తులను సీజ్ చేసిన ఈడీ

- రూ. 10 కోట్ల విలువైన శంకర్ ఆస్తుల జప్తు
- ఈనెల 17న ఆస్తులను జప్తు చేసినట్టు తెలిపిన ఈడీ
- కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఆస్తుల అటాచ్ మెంట్
ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ కు ఈడీ షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ చట్టం ప్రకారం రూ. 10 కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈనెల 17వ తేదీన ఆస్తులను అటాచ్ చేసినట్టు తెలిపింది.
'రోబో' సినిమాను శంకర్ తన కథ 'జిగుబా'ను కాపీ కొట్టి తెరకెక్కించారంటూ ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో పిటిషన్ దాఖలు చేశారు. శంకర్ కాపీరైట్, ఐటీపీ చట్టాలను ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు, ఈ కేసు విషయమై ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక కూడా శంకర్ కు వ్యతిరేకంగా వచ్చింది. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని శంకర్ ఉల్లంఘించారంటూ ఆ నివేదిక ఆధారంగా ఈడీ స్పష్టం చేసింది. ఆ సినిమాకు పారితోషికంగా శంకర్ రూ. 15 కోట్లు అందుకున్నట్టు సమాచారం. 2010లో విడుదలైన 'రోబో' ఘన విజయం సాధించింది.