Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై అనుచిత పోస్టు.. కేసు నమోదు

Inappropriate post on Pawan Kalyan

  • ఇటీవల కుంభమేళాకు వెళ్లిన పవన్ కల్యాణ్
  • భార్య, కుమారుడితో కలిసి పుణ్యస్నానం చేసిన పవన్ 
  • మరో నటుడు సంపూర్ణేశ్ బాబుతో పోలుస్తూ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి పోస్ట్

ఇతరులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదవుతున్నప్పటికీ... కొందరు మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. తమకు నచ్చని వ్యక్తులపై అనుచిత పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. కుంభమేళాలో తన భార్య అనా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ సభ్యుడు ఆనందసాయిలతో కలిసి పవన్ కల్యాణ్ పుణ్యస్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. 

వీరు పుణ్యస్నానాలు చేస్తున్న ఫొటోను మరో సినీనటుడు సంపూర్ణేశ్ బాబుతో పోలుస్తూ హర్షవర్ధన్ రెడ్డి ఒక ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై జనసైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత రిషికేశ్ కావలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రిషికేశ్ ఫిర్యాదు మేరకు కావలి పోలీసులు కేసు నమోదు చేశారు.  

Pawan Kalyan
Janasena
  • Loading...

More Telugu News