Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్

Bank Of Baroda Job Notification

  • డిగ్రీ అర్హతతో ఉద్యోగం.. మంచి ప్యాకేజీ
  • నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అందుకునే అవకాశం
  • మొత్తం 518 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 518 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టే ఈ నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహించి, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా నియామకం చేపట్టనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే రూ.48 వేలు చెల్లించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/career లో సంప్రదించాలని సూచించింది.

ఖాళీలు: 518 (సీనియర్‌ మేనేజర్, మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్, ఆఫీస్‌-డెవలపర్, ఆఫీసర్‌-క్లౌడ్‌ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, సీనియర్‌ మేనేజర్‌ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్‌ ఏపీఐ డెవలపర్, మేనేజర్‌ ఏపీఐ డెవలపర్, మేనేజర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌)

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం

వయసు: 22 ఏళ్ల నుంచి 43 ఏళ్లు

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.1,02,300

దరఖాస్తు ఫీజు: రూ.600 (జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌), రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు)

చివరి తేదీ: 2025 మార్చి 11

Jobs
Job Notifications
BOB
Bank Jobs
  • Loading...

More Telugu News