55 doctors: 55 మంది వైద్యులను విధుల నుంచి తొలగించిన ఏపీ ప్రభుత్వం

AP Govt terminates 55 doctors

  • సెలవు కూడా పెట్టకుండా ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న ప్రభుత్వ వైద్యులు
  • లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ 
  • లోకాయుక్త ఆదేశాలతో 55 మంది వైద్యులను తొలగించిన ఏపీ ప్రభుత్వం

సెలవు కూడా పెట్టకుండా ఏడాదికి పైగా విధులకు గైర్హాజరవుతున్న 55 మంది వైద్యులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. విధులకు వైద్యులు గైర్హాజరవుతున్నారని... డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారంటూ కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

ఈ అంశాన్ని లోకాయుక్త చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధులకు హాజరుకాని వారిని గుర్తించి, వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్త ఆదేశాల మేరకు విధులకు హాజరు కాని 55 మందిని ప్రభుత్వం గుర్తించి, వారిని టెర్మినేట్ చేసింది. టెర్మినేట్ అయిన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు.  

55 doctors
Andhra Pradesh
Termination
  • Loading...

More Telugu News