Sonia Gandhi: ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

sonia gandhi admitted in hospital

  • సోనియా గాంధీకి అస్వ‌స్థ‌త‌
  • ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రిలో చేరిక‌
  • ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన  వైద్యులు


కాంగ్రెస్ అగ్ర‌నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ అస్వ‌స్థ‌త‌కు గ‌ర‌య్యారు. ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆమె గురువారం ఢిల్లీలోని స‌ర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన‌ట్లు ఆల‌స్యంగా తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని, పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆసుపత్రి వ‌ర్గాలు పేర్కొన్నాయి. శుక్ర‌వారం సాయంత్రం ఆమెను ఇంటికి పంపిస్తామ‌ని ఆసుపత్రి బోర్డు మేనేజ్‌మెంట్ చైర్మ‌న్ డాక్ట‌ర్ అజ‌య్ స్వ‌రూప్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమె గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ నిపుణుల సంర‌క్ష‌ణ‌లో ఉన్నారు. ఆమెకు కొన్ని ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. సోనియాకు గ‌త డిసెంబ‌రులో  78 ఏళ్లు నిండాయి. పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా సోనియా చివ‌రిసారి ఫిబ్ర‌వ‌రి 13న బ‌హిరంగంగా క‌నిపించారు. 

Sonia Gandhi
sir Gangaram hospital
New Delhi
  • Loading...

More Telugu News