Taj Banjara: హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ

GHMC seizes Taj Banjara Hotel

  • రూ.1.43 కోట్ల పన్నులు బకాయి పడిన తాజ్ బంజారా హోటల్
  • పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదన్న అధికారులు
  • ఈరోజు ఉదయం ప్రధాన ద్వారాలకు తాళాలు వేసిన అధికారులు

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో హోటల్ ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. రోడ్డు నెంబర్ 1లో గల తాజ్ బంజారా హోటల్ రూ.1.43 కోట్ల మేర పన్ను బకాయి పడిందని అధికారులు పేర్కొన్నారు.

పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హోటల్ యాజమాన్యం స్పందించలేదని అధికారులు తెలిపారు. చివరిగా రెండు రోజుల గడువు ఇచ్చినప్పటికీ హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో, ఈరోజు ఉదయం చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Taj Banjara
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News