Satwiksairaj Rankireddy: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం

- నేడు ‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ పురస్కారాన్ని అందుకోనున్న సాయిరాజ్ మేనేజర్
- ఆ కార్యక్రమం కోసం అమలాపురం నుంచి బయలుదేరిన సాయి తండ్రి కాశీవిశ్వనాథ్
- కారులోనే గుండెపోటుతో కుప్పకూలిన వైనం
భారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కాశీవిశ్వనాథ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. సాత్విక్ మేనేజర్ నేడు ఢిల్లీలో ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాశీ విశ్వనాథ్ నిన్న అమలాపురంలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. కారులో ప్రయాణిస్తూ కాసేపటికే కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ఆయన అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.
కాశీవిశ్వనాథ్ పీఈటీగా పనిచేసి రిటైర్ కాగా, ఆయన భార్య రంగనాయకి ఉపాధ్యాయురాలు. పెద్ద కుమారుడు చరణ్ తేజ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారు.